ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు మా ప్రభుత్వం కూడా మొండి చెయ్యి చూపించింది

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-10 12:31:28  IST  )

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు గత ప్రభుత్వంతో పాటు,తమ ప్రభుత్వం కూడా మొండి చెయ్యి చూపిందని, తాను ప్రతి పక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా నిజాన్ని నిఖార్సుగానే మాట్లాడుతానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు.

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు మా ప్రభుత్వం కూడా మొండి చెయ్యి చూపించింది
X

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు మా ప్రభుత్వం కూడా మొండి చెయ్యి చూపించింది

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు గత ప్రభుత్వంతో పాటు,తమ ప్రభుత్వం కూడా మొండి చెయ్యి చూపిందని, తాను ప్రతి పక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా నిజాన్ని నిఖార్సుగానే మాట్లాడుతానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు. బుధవారం స్థానిక అల్మాస్ ఫంక్షన్ హాల్ ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు అధ్యక్షతన జరిగిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన మహావేదిక వేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఉద్వేగ పూరితంగా మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులేనని, మీరే నిజమైన ఉద్యమకారులని, మీకు సరియైన న్యాయం జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపైన, ఉద్యోగుల పైన అక్రమ కేసులను బనాయించిందని, వాటిని ఎత్తివేయించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల ను ఒబెదుల్లా కొత్వాల్, మరికొందరి నాయకులతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే అందుకు తను వంతుగా రూ.5 లక్షల ఫండ్ కేటాయిస్తానని ప్రకటించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ త్వరలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుధాకర్, కృష్ణ, నాగేశ్వరరావు,దేవదాసు, రవీదర్ రెడ్డి, అంజన్న,జెన్ రెడ్డి, నారాయణ, భగవంతు,నాగాంజనేయులు,లలితమ్మ,రామచంద్రయ్య, అమీనోదీన్,మజీద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story