- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి గ్రామానికి తాగునీరు అందించడమే మా లక్ష్యం : సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
ప్రతి గ్రామానికి తాగునీరు అందించడమే మా లక్ష్యం అని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు

దిశ, వెల్దండ : ప్రతి గ్రామానికి తాగునీరు అందించడమే మా లక్ష్యం అని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో ఐక్యత ఫౌండేషన్ ముందుంటుందని తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని పోచమ్మ గడ్డ తండాలో ఐక్యత ఫౌండేషన్ సహకారంతో రూ. 1లక్ష 50వేల తో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఆయన సర్పంచ్ మహిపాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రక్షిత త్రాగునీటి సౌకర్యం ఎంతో ముఖ్యమని, చాలా ప్రాంతాల్లో ప్రజలు శుద్ధి చేయని నీటిని వినియోగించడం వలన అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా తండాలలో నివసించే ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
పోచమ్మ గడ్డ తండాలో ఇంతకు ముందు కూడా తండా ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి తండా అభివృద్ధిలో భాగం అయ్యామని, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను స్థానికులు తన దృష్టికి తీసుకురాగా.. వెంటనే స్పందించి రూ.1.50 లక్షల వ్యయంతో ఈ మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా తండా ప్రజలకు శాశ్వతంగా స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి వస్తుందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గిరిజన తండాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ఐక్యత ఫౌండేషన్ ముందుంటుందని తెలిపారు. నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ మా సమస్యలను వెంటనే గుర్తించి స్పందిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
త్రాగునీటి సమస్యతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న తమకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని శుద్ధి నీటిని తమకు అందిస్తున్న సుంకిరెడ్డి కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్, ఆయా గ్రామాల సర్పంచ్ లు గన్యా నాయక్, రమేష్ నాయక్, మాజీ సర్పంచ్ పంతుల నాయక్, వార్డు మెంబర్ శ్రీరామ్ నిర్మలా, హనుమంత్, సీనియర్ నాయకులు వెంకట్ నాయక్, సేవ్యా నాయక్, రేక్యనాయక్, మున్య నాయక్, జైపాల్, తిరుపతి, శ్రీను నాయక్, లక్ష్మణ్ నాయక్, శ్రీను నాయక్ పాల్గొన్నారు.






