ఓటీటీలోకి వచ్చేసిన యంగ్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by I. Sairam |

లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకుల కోసం మోగ్లీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి వచ్చేసిన యంగ్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా, సాక్షి(Sakshi Madolkar) హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ లవ్ థ్రిల్లర్ చిత్రం ‘మోగ్లీ’(Mogli). సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వం వహించిన ఈ మూవీలో పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) యాంటీ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించగా.. కాల భైరవ సంగీతం అందించారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. అయితే రీసెంట్‌గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి వసూళ్లు సాధించింది.

అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) సొంతం చేసుకుంది. కొత్త ఏడాది కానుకగా జనవరి నెలలో ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో 2026లో ఓటిటీలో విడుదలైన తొలి తెలుగు సినిమాగా ‘మోగ్లీ’ నిలిచింది. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఈటీవీ విన్‌లో వీక్షించవచ్చు. కాగా కొత్త ఏడాది ప్రారంభంలోనే ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా ఓటిటిలోకి రావడంతో మూవీ లవర్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది.

Next Story