ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో రచ్చ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-09 06:03:23  IST  )

టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో రచ్చ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది హీరోయిన్ రాశి ఖన్నా. ఇటీవల తెలుసు కదా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతుంది. ఇదిలా ఉండగా.. దీపావళి సందర్భంగా గత నెల(అక్టోబర్ 17) లో థియేటర్లలో సందడి చేసిన రొమాంటిక్ డ్రామా మూవీ తెలుసు కదా. ఈ మూవీలో హీరోగా సిద్ధు జొన్నలగడ్డ, కథానాయికలుగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి నటించారు.

డైరెక్టర్ నీరజా కోన తెరకెక్కించిన ఈ రొమాంటిక్ చిత్రం ఇప్పుడు ఓటీటీ లోకి రానుంది. ఇక, తెలుసు కదా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం చిత్ర నిర్మాతలకు భారీ మొత్తం చెల్లించినట్లు సమాచారం. థియేట్రికల్ వెర్షన్ ముగియడంతో తెలుసు కదా స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల(నవంబర్‌) 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే.. తెలుసు కదా మూవీ స్టోరీ ఏంటంటే.. ఈ మూవీలో వరుణ్(హీరో) ఒక అనాధ. ఈ క్రమంలో ఒక రెస్టారెంట్ నడుపుతాడు. అనాధగా ఉన్న వరుణ్ తనకంటూ ఒక కుటుంబం కావాలని ఆశపడతాడు. ఈ సమయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంటుంది. వరుణ్ కి అంతకు ముందే రాగా(హీరోయిన్ శ్రీనిధి శెట్టి) అనే అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. ఈ సమయంలో అతని జీవితంలోకి అంజలి(హీరోయిన్ రాశి ఖన్నా) వస్తుంది. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. దీంతో వరుణ్ అంజలిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడే అతని లైఫ్ లోకి ముందు ప్రేమలో పడిన రాగ వస్తుంది. ఇక.. అప్పుడు వరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

Next Story