Pawan Kalyan​​ అంటే ఆమెకు ఎందుకంత కోపం....

by Sridhar Babu |   (  Updated:2023-06-30 12:24:52  IST  )

పవన్​కళ్యాణ్​​ అంటే అందరికీ ఓ క్రేజ్​. ఆయన స్టైల్​, సినిమా అంటే ఓ ట్రెండ్​ సెట్టింగ్​ అని తెలిసిందే.

Pawan Kalyan​​ అంటే ఆమెకు ఎందుకంత కోపం....
X

దిశ, వెబ్​డెస్క్​ : పవన్​కళ్యాణ్​​ అంటే అందరికీ ఓ క్రేజ్​. ఆయన స్టైల్​, సినిమా అంటే ఓ ట్రెండ్​ సెట్టింగ్​ అని తెలిసిందే. ఇక ఆయనతో సినిమా చేయాలంటే సినీ పరిశ్రమలో చాలా మంది ఎంతో ఆసక్తి చూపుతారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడంతో చాలా మంది ఆయన్ని విమర్శిస్తున్నారు కానీ ఒకప్పుడు ఆయనతో నటించాలంటే ఎగిరి గంతేసేవారు. కానీ ఆయన దృష్టిలో పడటానికో లేదా నిజంగానే ఆయనతో విభేదాలు ఉన్నాయో తెలియదు కానీ ఓ నటి ఆయనంటే ఇష్టం లేదని, అసలు ఆయనతో జన్మలో నటించను అని వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దాంతో జనసేన నేతలతో పాటు, పవన్​ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఇదే వార్త నేడు సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు రాయలసీమ సుందరి ప్రియాంక జవాల్క‌ర్. హైదరాబాద్​ నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప‌ట్టా పుచ్చుకుని ఆపై షార్ట్‌ ఫిలింస్‌లో నటిగా ఆకట్టుకుంటుంది. అనంతరం 2017లో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా, సత్యదేవ్ నటించిన తిమ్మరుసు, కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం, గమనం వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. అయినా ఈమెకు సరైన అవకాశాలు రాలేదు.

దాంతో పలు సందర్భాల్లో ఎక్స్​పోజింగ్​ చేస్తూ పలు ఫొటోషూట్‌లు చేసినా ఫలితం దక్కలేదు. దాంతో పవన్ పేరు ప్రస్తావన తెస్తే తనకు పబ్లిసిటీ లభించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతానని భావించిందో ఏమో కానీ తనకు ఆయనతో అవకాశం వచ్చినా చచ్చినా చేయనంటూ కామెంట్లు చేసింది. దాంతో అమ్మడు అనుకున్నట్టు మంచి ప్రచారం జరుగుతుంది. దీనిపై పలు ట్రోల్స్​ కూడా జోరందుకున్నాయి. అవకాశాలు లేని ఆమెకు పవన్​ సినిమాలో కనీసం చిన్న వేషమైనా దొరుకుతుందా అంటూ కొందరు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మరి పవన్​తో ఈమెకు ఉన్న ఆ గొడవేంటో వారిద్దరికే తెలుసు. అయితే మరో పక్క పవన్​ అంటే తనకు ప్రాణం అని, ఆయన సినిమాలు ఒకటికి పది సార్లు చూస్తానంటుంది. దాంతో ఈమె ప్రవర్తనతో జనం మతిపోతుంది.

Also Read..

కన్న తండ్రే చీట్ చేశాడా.. అందుకే అల్లు శిరీష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడా?

Next Story