- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాను శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించగా.. మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది.

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాను శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించగా.. మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ పుల్వామా దాడి, భారత్ పాక్ వైరం తదితర అంశాల ఆధారంగా రూపొందించారు. ఆపరేషన్ వాలెంటైన్ ఇన్నోసార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు నేడు మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఆపరేషన్ వాలెంటైన్ డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఆపరేషన్ వాలెంటైన్ స్ట్రీమింగ్ నాలుగు వారాల తర్వాత అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంటే ఏప్రిల్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.






