ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాంత’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?(ట్వీట్)

by I. Sairam |   (  Updated:2025-12-09 15:45:00  IST  )

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌(Dulquer Salman) మనందరికీ సుపరిచితమే.

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాంత’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?(ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌(Dulquer Salman) మనందరికీ సుపరిచితమే. మలయాళ హీరో అయినటువంటి ఇతనికి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం’(Ok Bangaram) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ యంగ్ హీరో.. మహానటి సినిమాతో మంచి విజయం సాధించాడు. ఈ సినిమా దుల్కర్‌ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఆ తర్వాత హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామం’(Seetharamam) సినిమాతో స్టార్ హీరో రేంజ్‌కి వెళ్ళిపోయాడు.

అయితే ఆయన రీసెంట్‌గా ‘కాంత’(Kantha) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెల్వమణి సెల్వరాజ్‌ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే సముద్రఖని(Samudra Khani), దగ్గుబాటి రానా(Rana Daggupati) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌(Net Flix) సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా ఈ చిత్ర డిసెంబర్‌ 12 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్‌ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మరి థియేటర్లలో ఓకే ఓకే అనిపించుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Click For Tweet .....

Next Story