- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా.. పోస్ట్ వైరల్
బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) నటించిన లేటెస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi).

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) నటించిన లేటెస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi). నితిన్(Nithin), భరత్(Bharath)లు తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో ఓటీటీ ప్రేక్షకులు ఈ మూవీ ఓటీటీ(OTT)లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.
ఇందులో భాగంగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి ఈటీవీ విన్(ETVWin)లో ఈ సినిమా మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటీవీ విన్ పోస్టర్ షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా థియేటర్లలో విడుదలై నెల రోజులు పూర్తి కాకుండానే ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుండటంతో ఓటీటీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






