- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ నాలుగో సీజన్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఓటీటీలో ప్రసారం అవుతూ సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న సిరీస్‌లో ‘పంచాయత్’(Panchayat) ఒకటి. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే మూడు సీజన్లు రాగా.. మంచి సక్సెస్ అందుకున్నాయి.

దిశ, సినిమా: ఓటీటీలో ప్రసారం అవుతూ సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న సిరీస్‌లో ‘పంచాయత్’(Panchayat) ఒకటి. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే మూడు సీజన్లు రాగా.. మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు నాలుగో సీజన్ జూలై 02 నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోస్ (Prime Videos) అధికారికంగా తెలియజేస్తూ ఓ వీడియో షేర్ చేసింది. ఇక ఈ సీజన్ అంతా కూడా పంచాయితీ ఎన్నికల బ్యాక్ డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తుంది.
కథ విషయానికి వస్తే.. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు.. ఓ మారుమూల పల్లెలోకి పంచాయతీ సెక్రటరీగా అడుగుపెడతాడు. నిజానికి విదేశాలకు వెళ్లిపోవాలనేదే అతడి కల. అలాంటిది స్నేహితులు, తండ్రి మాటపై ఆ పల్లె టూరికి జాబ్ చేసేందుకు వెళతాడు. అక్కడ జాబ్ తప్పక చేస్తాడు కానీ, ఆ పల్లెటూరి వాతావరణాన్ని అస్సలు ఇష్టపడడు. అలాంటి వ్యక్తిని పల్లెలోని కొందరు మార్చేస్తారు. తర్వాత ఏమైంనేదే స్టోరీ. ఇప్పుడు దానికి కంటిన్యూషన్‌గా పంచాయత్ సీజన్ 4 రాబోతుంది. కామెడీ ప్లస్ ఎమోషనల్‌గా ఉండే ఈ సిరీస్ తెలుగులో ‘సివరపల్లి’ (Sivarapalli) అనే పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే.






