ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

by Phanindra |

జెర్సీ సినిమా ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌..  ఎక్కడ చూడొచ్చంటే?
X

దిశ,వెబ్ డెస్క్: జెర్సీ సినిమా ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ తర్వాత జోడి, శ్రీకృష్ణ అండ్‌ హిజ్‌ లీలీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అందాల తార. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటిస్తూనే ఓటీటీల్లోనూ దూసుకెళ్తుంది. విక్టరీ వెంకటేష్‌ సైంధవ్‌ సినిమాతో త్వరలో మన ముందుకు రానుంది. కాగా 2017లో శ్రద్ధా శ్రీనాథ్‌ నటించిన కన్నడ సినిమా ఆపరేషన్‌ అలమేలమ్మ. సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌కు జోడీగా సైతాన్‌ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ రిషి నటించాడు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ విషయాన్ని ఆహా సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘రేషన్‌ లో ఇస్తారు షుగర్‌. ఆపరేషన్‌ అలమేలమ్మ బెస్ట్‌ కామెడీ థ్రిల్లర్‌’ అని తన పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చింది ఆహా ఓటీటీ.

Next Story