సిల్క్‌ స్మిత చదివింది నాలుగో క్లాసే నట....నేడు సిల్క్‌ స్మిత పుట్టిన రోజు

by Sridhar Babu |

ఐటమ్​ గర్ల్​ సిల్క్​ స్మిత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

సిల్క్‌ స్మిత చదివింది నాలుగో క్లాసే నట....నేడు సిల్క్‌ స్మిత పుట్టిన రోజు
X

దిశ, వెబ్​ డెస్క్​ : ఐటమ్​ గర్ల్​ సిల్క్​ స్మిత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను బతికున్న రోజుల్లో తన మత్తు కళ్లతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. నేడు ఆమె పుట్టిన రోజు. ఈమె అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. డిసెంబర్ 2, 1960న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో గల ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఈమె తన బోల్డ్, సెక్సీ పాత్రలతో అగ్రస్థాయిలో నిలిచారు.

స్మిత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో సహా వివిధ భాషలలో సుమారు 450కి పైగా చిత్రాలను చేశారు. ఈమె నాల్గవ తరగతి మాత్రమే చదివారంటే ఆశ్చర్యం కలుగుతుంది. 17 సంవత్సరాల వయస్సులోనే సినిమా అవకాశాలను దక్కించుకుని ఎంతో కష్టపడి స్టార్​డం సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో ఈమె పాత్ర లేని సినిమా అంటూ ఉండేది కాదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చివరికి చెన్నై అపార్ట్‌మెంట్‌లో సెప్టెంబర్​ 23,1996న ఆత్మహత్య చేసుకున్నారు.

Next Story