Shraddha Srinath: ఓటీటీలోకి శ్రద్ధా శ్రీనాథ్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్!

by Chukka Sudharani |

‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath).

Shraddha Srinath: ఓటీటీలోకి శ్రద్ధా శ్రీనాథ్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్!
X

దిశ, సినిమా: ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath). మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రజెంట్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది శ్రద్ధా.. ‘కలియుగం 2064’ (Kali Yugam 2064) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీపై రిలీజ్‌కు ముందు పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ కాగా.. భారీ అంచనాల మధ్య మే 9న విడుదలైంది. కానీ ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ (OTT) రిలీజ్‌కు సంబంధించి ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రముఖ ఓటీటీ సంస్థ సింప్లీసౌత్ యాప్‌(SimplySouth App)లో జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటన విడుదలైంది. ఇక తెలుగు వెర్షపై మాత్రం ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది.

Twitter Link

Next Story