ఐకాన్ స్టార్, అల్లు అరవింద్‌‌లకు షాకిచ్చిన గూగుల్ ప్లే స్టోర్.. పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ ఎన్ని చిత్రాలకు ప్రొడ్యూసర్‌గా డిస్ట్రిబ్యూటర్‌గా సినిమా రంగాన్ని గత కొద్ది కాలంగా శాసిస్తున్నాడు.

ఐకాన్ స్టార్, అల్లు అరవింద్‌‌లకు షాకిచ్చిన గూగుల్ ప్లే స్టోర్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ ఎన్ని చిత్రాలకు ప్రొడ్యూసర్‌గా డిస్ట్రిబ్యూటర్‌గా సినిమా రంగాన్ని గత కొద్ది కాలంగా శాసిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన కొడుకు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీని దక్కించుకున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోగా టాలీవుడ్‌లో రాణిస్తున్నాడు. అయితే అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటుగా ఆహా ఓటీటీ సంస్థను ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చాడు. దీని ద్వారా ఓటీటీలోనూ పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ప్రేక్షకులకు అందిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా అప్పుడప్పుడు ఈ యాప్‌ కోసం అల్లు అర్జున్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటాడు. కానీ ఇటీవల నష్టాలు వస్తుండటంతో అల్లు అర్జున్ ఆహాను అమ్మకానికి పెట్టినట్లు వార్తలు కూడా వచ్చాయి. వాటిపై అల్లు ఫ్యామిలీ స్పందించలేదు.

ఈ క్రమంలో.. తాజాగా గూగుల్ ప్లే స్టోర్ అల్లు అరవింద్‌కు బిగ్ షాకిచ్చింది. ఓటీటీ యాప్ ఆహాను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. తన పాలసీకి విరుద్ధంగా ఉన్న యాప్స్ అన్నింటినీ తొలగించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓటీటీపై కూడా వేటు పడింది. దీంతో పాటుగా పలు యాప్స్‌ను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు నడుస్తుండగానే ఇలా యాప్స్‌ను తొలగించారు.

దీనిపై ఆహా వారు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘హాయ్, ఆహా యాప్ ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవడానికి Google Play స్టోర్‌లో అందుబాటులో లేదు. ప్రభావం కొత్త యాప్ డౌన్‌లోడ్‌లకే పరిమితం చేయబడింది. మేము ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము. వీలైనంత త్వరగా మేము నవీకరణను అందిస్తాము. ఈ సమయంలో, వినియోగదారులు మీ ఇన్‌స్టాల్ చేసిన aha యాప్‌లో లేదా http://aha.videoలో aha కంటెంట్‌ని ప్రసారం చేయడానికి ఎంచుకోవచ్చు. దీని వల్ల ఏదైనా అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. మీ సహనానికి అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఇది చూసిన సినీ ప్రేక్షకులు కంటెంట్ రావట్లేదు. మళ్లీ ఇన్‌స్టాల్ చేయడానికి అందుబాటులో లేదు అమౌంట్ రీఫండ్ కొట్టాలంటూ ఫైర్ అవుతున్నారు.

Next Story