- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prabhas Salaar Movie ticket price : సలార్ సినిమా టికెట్ రేటు అంతనా
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందిన సలార్ చిత్రం రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది.

దిశ, వెబ్‌డెస్క్ : కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందిన సలార్ చిత్రం రిలీజ్ అయ్యేందుకు సిద్దమ వుతుంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా టికెట్ రేట్లు చూస్తేనే సామాన్యుల కళ్లు బయిళ్లు కమ్ముతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ మల్టీప్లెక్స్‌లో 450 రూపాయలు, సింగిల్ స్క్రీన్‌లో 250 ఉండనుందని సమాచారం. మరో పక్క ఈ మేరకు రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ రెండు రాష్ట్రాల సీఎంలను రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. ప్రభుత్వాలు అనుమతి ఇస్తే సామాన్యులు సినిమా చూసే అవకాశం ఉందడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సలార్ మూవీకి టికెట్ రేట్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలపై చిన్న నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.






