- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ పోతినేని ‘స్కంద’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘స్కంద’. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘స్కంద’. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న థియేటర్స్‌లో విడుదల పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా రెండు మూడు రోజులు భారీ కలెక్షన్స్ ను రాబట్టింది.కానీ ఆ తర్వాత మెల్లగా కలెక్షన్స్ తగ్గిపోతూ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అక్టోబర్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. కానీ త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.






