Ram Charan: ‘పెద్ది’ రిలీజ్‌కు ముందే రికార్డు... భారీగా ఓటీటీ డీల్

by Chukka Sudharani |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddhi).

Ram Charan: ‘పెద్ది’ రిలీజ్‌కు ముందే రికార్డు... భారీగా ఓటీటీ డీల్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddhi). బుచ్చిబాబు సనా (Buchibabu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పుటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కాగా.. 30% షూట్ పూరైనట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్ట్స్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. ఇటీవల వచ్చిన గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కాగా.. ఒక్క దెబ్బకు భారీ ధరకు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

‘పెద్ది’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ (OTT) సంస్థలు పోటీ పడగా.. ఫైనల్‌గా నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. తొలుత రూ. 105 కోట్లు అందజేసి.. సినిమా రిజల్ట్ బట్టి ఆ అమౌంట్ మరింత పెంచే విధంగా డీల్ ఓకే అయిందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. గ్లింప్స్ చూసే రూ. 105 కోట్లు డీల్ అంటే ట్రైలర్ చూస్తే ఏమైపోతారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్. అలాగే ఓటీటీ డీల్‌తోనే రికార్డు సాధించింది మా అన్న సినిమా అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల కానుంది.

Next Story