ఓటీటీలోకి వచ్చేస్తున్న సైక్‌ సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by I. Sairam |

టాలీవుడ్ యువ‌ నటుడు నందు(Nandu), యామిని భాస్కర్‌(Yamini Bhaskar) జంటగా నటించిన ‘సైక్‌ సిద్ధార్థ’(Psych Sidharth) మూవీ జనవరి ఫస్ట్‌న థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న సైక్‌ సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యువ‌ నటుడు నందు(Nandu), యామిని భాస్కర్‌(Yamini Bhaskar) జంటగా నటించిన ‘సైక్‌ సిద్ధార్థ’(Psych Sidharth) మూవీ జనవరి ఫస్ట్‌న థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అడల్ట్‌ కామెడీతో తెరకెక్కిన ఈ మూవీకి వరుణ్‌ రెడ్డి(Varun Reddy) ద‌ర్శ‌క‌త్వం వహించగా ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు.

అయితే ట్రైలర్స్‌తో మెప్పించిన ఈ సినిమా థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా(Aha)లో ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో ఓకే ఓకే అనిపించుకున్న ఈ మూవీ ఓటీటీ ప్రియులనైనా మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది.

Next Story