Patal Lok Season-2: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీక్వెల్

by Gugulothu.Kavitha |

అమెజాన్ ప్రైమ్‌(Amazon Prime)లో రిలీజ్ అయి వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్‌‌గా పేరు తెచ్చుకున్న సిరీస్‌లో ‘పాతాల్ లోక్’(Patal Lok) వెబ్ సిరీస్‌ ఒకటి.

Patal Lok Season-2: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీక్వెల్
X

దిశ, సినిమా: అమెజాన్ ప్రైమ్‌(Amazon Prime)లో రిలీజ్ అయి వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్‌‌గా పేరు తెచ్చుకున్న సిరీస్‌లో ‘పాతాల్ లోక్’(Patal Lok) వెబ్ సిరీస్‌ ఒకటి. సుదీప్ శర్మ(Sudeep Sharma) తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌ని.. క్లీన్ స్లేట్ ఫిల్మ్ బ్యానర్‌పై అనుష్క శర్మ(Anushka Sharma) నిర్మించింది. ఇక ఇందులో జైదీప్ అహ్లావత్(Jaideep Ahlawat), గుల్ పనాగ్(Gul Panag) కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సీజన్ 2 కోసం ఓటీటీ ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ పార్ట్-2 ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి (జనవరి 17) ‘పాతాల్ సీజన్ 2’(Patal Lok Season 2) ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ మేకర్స్ పోస్ట్ పెట్టారు. ‘పాతాల్ లోక్ సీజన్-2కి స్వాగతం. ఈ కొత్త సీజన్ అదిరిపోయే థ్రిల్లింగ్ అంశాలతో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది’ అంటూ ఓటీటీ డీటైల్స్ వెల్లడించారు. దీంతో ఓటీటీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో చూసేయండి.

Next Story