- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT Movie: ఓటీటీలో స్టార్ హీరోయిన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..?
ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వంటి సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వంటి సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఆ జోనర్లకు సంబంధించిన చిత్రాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఈ కోవకు చెందిన ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో దుమ్మురేపుతోంది. మరి దాని వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం..
ఈ సిరీస్ పేరు ‘నవంబర్ స్టోరీ’(November Story). ఇది ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. అలాగే చాలా ఆసక్తికరమైన కథను కలి ఉన్న ఈ సిరీస్ నిడివి దాదాపు 30-52 నిమిషాల మధ్య ఉంటుంది. దీనికి ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు తెలుగులోకి కూడా ఈ సిరీస్ డబ్ చేశారు. ఇది 2021లో విడుదలైంది. ఈ సిరీస్‌లో స్టార్ హీరోయిన్ తమన్న(Tamannah) అనురాధ పాత్రను పోషించింది. ప్రస్తుతం ‘నవంబర్ స్టోరీ’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి డిస్నీ+ హాట్‌స్టార్(Disney+ Hotstar)లో అందులోబాటులో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం త్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని చూసేయండి.






