- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
గత కొద్ది రోజుల నుంచి ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ నెల రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. చిన్న సినిమాలు అయినా కొన్ని థియేటర్స్‌లోని కంటే ఓటీటీలోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తున్నాయి. తాజాగా, ఓ మూవీ థియేటర్స్‌లో విడుదలైన 20 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులో వచ్చేస్తుంది.
రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ది బర్త్ డే బాయ్’. ఈ మూవీకి విస్కీ దాసరి దర్శకత్వం వహించగా.. బొమ్మా బొరుసా బ్యానర్స్‌పై భరత్ నిర్మించాడు. అయితే ఈ మూవీ జూలై 19న థియేటర్స్‌లో విడుదలై మెప్పించలేకపోయింది. తాజాగా, బర్త్ డే బాయ్ మూవీ ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారికంగా ఆహా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.






