2018 Movie OTT Release Date :బ్లాక్ బస్టార్ మూవీ ‘2018’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

by Disha Web Desk 23 |
2018 Movie OTT Release Date :బ్లాక్ బస్టార్ మూవీ ‘2018’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?
X

దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి ఇండస్ట్రీని ఊపేస్తున్న మలయాళ మూవీ ‘2018’. కేరళలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 17 రోజుల్లోనే రూ.138 కోట్లు వసూలు చేసింది. కేరళ, ఓవర్సీస్‌లో కలిపి సుమారు రూ.128 కోట్ల వరకు రాబట్టింది. కర్ణాటకలో మలయాళ వెర్షన్ రూ.4 కోట్లు వసూలు చేసి. ఆ రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీలో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పుడు తెలుగు, హిందీ, కన్నడ,తమిళ వెర్షన్‌లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై కూడా ఓ క్లారిటీ వచ్చింది. జూన్ 9 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై అధికారికంగా అనౌన్స్‌మెంట్ రాలేదు.

Read more:

రెండు వారాల్లో రూ. 140 కోట్లు వసూల్ చేసిన ‘2018’.. తెలుగులో విడుదలకు సిద్ధం

Next Story

Most Viewed