ఓటీటీలోకి మీర్జాపూర్ ‘సీజన్-3’.. స్ట్రీమింగ్ డేట్ వెతుకోండంటూ సినీ ప్రియులకు షాకిచ్చిన ప్లాట్‍ఫామ్

by Mallepaka Hamsa |

ఇటీవల కాలంలో పూర్తిగా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. ఎన్నో సూపర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ సినీ ప్రియులకు అలరిస్తున్నాయి.

ఓటీటీలోకి మీర్జాపూర్ ‘సీజన్-3’.. స్ట్రీమింగ్ డేట్ వెతుకోండంటూ సినీ ప్రియులకు షాకిచ్చిన ప్లాట్‍ఫామ్
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో పూర్తిగా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. ఎన్నో సూపర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ సినీ ప్రియులకు అలరిస్తున్నాయి. అయితే మిర్జాపూర్ క్రైమ్ థ్రిల్లర్ ఇండియావైడ్‌గా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు సీజన్లు పూర్తై అద్భుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. అయితే రెండో 2020 వచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తికని పెంచడంతో సీజన్-3 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ మీర్జాపూర్ సీజన్-3 స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేశారు. కానీ బిగ్ ట్విస్ట్ ఇచ్చి నెటిజన్లకు పరీక్ష పెట్టారు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేశారు. కానీ స్ట్రీమింగ్ తేదీ ప్రకటించకుండా ఓ యానిమేటెడ్ పోస్టర్ రిలీజ్ చేసి మీరే వెతుక్కోండి అని వెల్లడించారు. అందులో డేట్ దాగుందని అది కనిపెట్టాలని చెప్పి షాకిచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా డేట్‌ను కనిపెట్టలేక తలలు పట్టుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం అందులో ఉన్న వస్తువులను బట్టి 7 గన్నులు, 7 కార్పెట్స్, 7 బల్లెట్స్ కింద పడి ఉండటం చూస్తే జూలై 7 న స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుందని కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది మాత్రం మూడు 7 లను కలిపితే 21 అవుతుంది కాబట్టి జూలై 21న రాబోతుంది కావొచ్చు అని చర్చించుకుంటున్నారు. కానీ దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేదాకా స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది తెలియదు.

Next Story