ఇట్స్ అఫీషియల్: ఎట్టకేలకు 16 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న స్టార్ హీరో సినిమా..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-20 15:21:01  IST  )

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajini Kanth) ప్రత్యేక పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య(Aishwarya) దర్శకత్వం వహించిన సినిమా 'లాల్ సలామ్'(Lal Salam).

ఇట్స్ అఫీషియల్: ఎట్టకేలకు 16 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న స్టార్ హీరో సినిమా..
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajini Kanth) ప్రత్యేక పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య(Aishwarya) దర్శకత్వం వహించిన సినిమా 'లాల్ సలామ్'(Lal Salam). విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్ సంతోష్(Vikranth Santhosh) హీరోలగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 9, 2024లో థియేటర్లలో విడుదల అయ్యింది. సుమారు 90 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయ్యింది. కేవలం 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. దీంతో త్వరలో ఓటీటీలో వస్తుందని ఆడియన్స్ అందరూ ఆశించారు. అయితే... థియేటర్లలో విడుదలైన 16 నెలలకు గాని ఓటీటీలోకి రావడం లేదు.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుందని అఫీషియల్‌గా ప్రకటించారు. ఇందులో భాగంగా 'లాల్ సలామ్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మొదటగా నెట్‌ఫ్లిక్స్(Net Flix) కొనుగోలు చేయగా.. పలు కారణాలతో సన్‌నెక్స్ట్(SUN Next) చేతికి వచ్చాయి. ఈ మేరకు ఆ ఓటీటీ వేదిక అధికారికంగా ఒక ట్వీట్ చేసింది.‌ బక్రీద్ సందర్భంగా సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సన్ నెక్స్ట్ పేర్కొంది. జూన్ 6వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఓటీటీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story