ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.235 కోట్ల సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by I. Sairam |   (  Updated:2025-05-27 11:45:59  IST  )

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohanlal), అలనాటి స్టార్ హీరోయిన్ శోభన(Shobhana) నటించిన లేటెస్ట్ మూవీ ‘తుడరుమ్’(Thudarum).

ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.235 కోట్ల సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohanlal), అలనాటి స్టార్ హీరోయిన్ శోభన(Shobhana) నటించిన లేటెస్ట్ మూవీ ‘తుడరుమ్’(Thudarum). తరుణ్ మూర్తి(Tarun Moorthi) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

అలా ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది . అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. వాస్తవానికి మే మూడో వారంలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా.. థియేటర్లలో బాగానే వసూళ్లు సాధిస్తుండటంతో ఓటీటీ సంస్థ దానిని ఒక వారం ముందుకు వాయిదా వేసింది. అంటే మే30న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. దీనిపై తాజా అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ క్రమంలో తాజాగా ఈ నెల 30 నుంచి తుడరుమ్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు జియో హాట్ స్టార్(Jio Hotstar) వెల్లడిస్తూ.. సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. కాగా ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జియో హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పటివరకు థియేటర్లలో తుడరుమ్ చూడని వారు ఈ నెల 30నుంచి జియో హాట్ స్టార్‌లో చూసేయండి.

Next Story