- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుధీర్ ‘సర్కార్ సీజన్-5’ లేటెస్ట్ ప్రోమో చూశారా..? ఈసారి గెస్టులుగా రాబోతుంది వీరే..
ప్రముఖ తెలుగు ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ ఆహా(Aha)లో స్ట్రీమింగ్ అయ్యే ‘సర్కార్’(Sarkar) ఇప్పటికే నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 5కు రంగం సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తెలుగు ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ ఆహా(Aha)లో స్ట్రీమింగ్ అయ్యే ‘సర్కార్’(Sarkar) ఇప్పటికే నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 5కు రంగం సిద్ధమైంది. అయితే ఈ ఓటీటీ షో మూడు సీజన్లను ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) హోస్ట్‌గా వ్యవహరించాడు. గత నాలుగో సీజన్ నుంచి స్టార్ కమెడియన్ కమ్ హీరో సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఐదో సీజన్‌ను కూడా సుడిగాలి సుధీరే హోస్ట్ చేయనున్నాడు. ఇప్పటికే రిలీజైన సర్కార్ సీజన్ 5 గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకోగా.. తాజాగా సర్కార్ సీజన్ 5 ప్రోమో రిలీజైంది. ఇక ప్రోమోలో ఎప్పటి లాగే సుధీర్ తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు.
ఇక ఈ ఐదో సీజన్‌కి స్టార్ సెలబ్రిటీలు అయినటువంటి పొలిమేర హీరోయిన్ కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla), దక్ష నగార్కర్(Daksha Nagarkar), కోర్టు సినిమా హీరో, హీరోయిన్లు హర్ష్ రోహన్(Harsha Rohan), శ్రీదేవి(Sridevi) అలాగే నైన్టీస్ వెబ్ సిరీస్ ఫేమ్ వాసంతిక(Vasanthika) లాంటి సెలబ్రిటీలు సర్కార్ సీజన్ 5 లో సందడి చేయనున్నారు. మొత్తానికి గ్లింప్స్, ప్రోమోతోనే సీజన్ 5 పై ఆసక్తి రెట్టింపయ్యింది. కాగా జూన్ 6న సాయంత్రం 7 గంటల నుంచి ఐదో సీజన్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. అలాగే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రానుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






