Adipurush : ఆదిపురుష్​ చిత్రం చూసేందుకు హనుమంతుడు హాజరు

by Disha Web Desk 15 |
Adipurush : ఆదిపురుష్​ చిత్రం చూసేందుకు హనుమంతుడు హాజరు
X

దిశ, వెబ్​ డెస్క్​ : ప్రస్తుతం ప్రభాస్​ నటించిన ఆదిపురుష్​ ఫీవర్​ నడుస్తుంది. భారీ అంచనాలతో ఈ రోజు విడుదలైన ఈ సినిమా మొదటి నుంచీ ఏదో ఒక సంచలం సృష్టిస్తుంది. అలాగే విడుదలైన మొదటి రోజు కూడా ఓ అద్భుతం ఆవిషృతమైంది. ఈ సినిమా చూసేందుకు ఏకంగా హనుమంతుడే థియేటర్​కు వచ్చాడనే వార్త సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తుంది. వివరాల్లోకెళితే....రామాయ‌ణంలో శ్రీరాముడు న‌మ్మిన బంటు ఆంజ‌నేయుడు. రామ‌పారాయ‌ణం ఎక్క‌డ జ‌రుగుతుంటే అక్క‌డే హ‌నుమంతుడు ఉంటాడ‌ని అందరికీ తెలుసు.

అయితే ఆదిపురుష్ సినిమా థియేట‌ర్స్‌లో ఓ సీటుని అమ్మ‌కుండా అలాగే ఖాళీగా ఉంచుతామని ఆ సినీ మేక‌ర్స్ చెప్పారు. అన్న‌ట్లుగానే ఓ థియేట‌ర్‌లో ఓ సీటుని ఖాళీగా ఉంచారు. అది హనుమంతుడి కోసమని చిత్రవర్గాలు చెబుతున్నాయి. హనుమంతుడు సినిమా చూసేందుకు వస్తాడని వారు నమ్మారు. యాదృచ్చికమో, లేక నిజమో తెలియదు కానీ నిజంగానే ఓ థియేటర్​లోకి అందరి కండ్లుకప్పి ఓ కోతి ప్రవేశించింది. హాయిగా సినిమా చూడటం మొదలుపెట్టింది. దాంతో అది చూసిన జనాలు ఒక్కసారిగా థియేటర్​లో జై శ్రీరామ్​...జై హనుమాన్​ అంటూ నినాదాలు చేశారు. చిత్ర యూనిట్​ నమ్మకాన్ని వమ్ముచేయకుండా హనుమంతుడు రాముడి కోసం వచ్చాడని భక్తులు విశ్వసిస్తున్నారు.

Read More: Adipurush:పబ్లిక్ టాక్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే? (వీడియో)

నాకు అర్హత లేకపోయినా ‘ఆదిపురుష్’‌లో లక్ష్మణుడిగా నటించా.. నటుడి కామెంట్స్ వైరల్


Next Story