- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్ర నిర్మాణ రంగంలోకి గ్రీన్ గోల్డ్ గ్రూప్
వరల్డ్ యానిమేషన్ రంగంలో అద్భుతమైన ప్రతిభ చాటిన గ్రీన్ గోల్డ్ గ్రూప్ ఇప్పుడు చిత్ర నిర్మాణరంగంలోకి రానుంది.

దిశ, వెబ్‌డెస్క్ : వరల్డ్ యానిమేషన్ రంగంలో అద్భుతమైన ప్రతిభ చాటిన గ్రీన్ గోల్డ్ గ్రూప్ ఇప్పుడు చిత్ర నిర్మాణరంగంలోకి రానుంది. చిలకా ప్రొడక్షన్స్ పేరుతో ఈ సంస్థ చిత్రాలను నిర్మించనుంది. దీనికి సంబంధించిన లోగోను నిర్మాత అల్లు అరవింద్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ లయన్ కింగ్ సినిమా చూశాక ఇలాంటి చిత్రాన్ని ఇండియాలో ఎందుకు తీయకూడదని అనిపించింది. వాల్ట్ డీస్నీ నాకు ఎప్పుడూ ఓ ఇన్స్ప్రెషన్. తాను యానిమేషన్ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి. వాటిని అధిగమించి సిన్సియర్‌గా కష్టపడుతూ వచ్చాం. కృష్ణ, చోటా బీమ్ వంటి యానిమేటెడ్ ఫిల్మ్స్ తీశాం. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల చిత్రం తీస్తున్నాను. ఇవి కాకుండా చాలా ప్లాన్స్ ఉన్నాయి. పరిశ్రమలో అల్లు అరవింద్గారిలా ఎదగాలని ఉంది అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇలాంటి కొత్త ప్రయోగాలు చేసే వ్యక్తుల్ని, సంస్థలను పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు.






