సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు

by Mallepaka Hamsa |   (  Updated:2023-04-20 11:04:48  IST  )

ఓటీటీ సంస్థలు వచ్చిన కానుంచి సినీ ప్రియులు ఎక్కువగా థియేటర్స్‌కు వెళ్లడం మానేశారు.

సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓటీటీల్లో కింగ్‌గా వెలుగుతున్న నెట్​ఫ్లిక్స్​తన సబ్‌స్క్రైబర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియా వ్యూయర్స్‌ను పెంచుకోవడానికి నెట్​ఫ్లిక్స్​తన సబ్​స్క్రిప్షన్ ప్లాన్స్‌లో మార్పులు తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు 115 దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ధర నెలకు రూ.199 ఉన్న మొబైల్‌ ప్లాన్‌ను రూ.149కి తగ్గించింది. అదే విధంగా టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్‌.. అన్నింటిలో యాక్సెస్ చేసుకోగలిగే బేస్‌ సబ్‌స్క్రిప్షన్ చార్జీ గతంలో రూ. 499 ఉండగా ప్రస్తుతం రూ.199 గా ఉంది. 2021లో భారత్‌లో తక్కువ ధర సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది.

అప్పటి నుంచి దేశంలో కస్టమర్ల ఎంగేజ్మెంట్‌లో 30 శాతం పెరుగుదలతో పాటు వార్షిక ఆదాయంలో 24 శాతం పెరుగదలను నమోదు చేసింది. దీంతో భారతీయ మార్కెట్‌పై నెట్ ఫ్లిక్స్ మొదటిసారిగా 20 నుంచి 60 శాతం చార్జీలను తగ్గించింది. ఇక నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ కావాలనుకునే వారికి ఇవి సరసమైన ధరలనే చెప్పాలి. కాగా, నెట్‌ఫ్లిక్స్ సంస్థ త్వరలోనే పెయిడ్ పాస్‌వర్డ్ షేరింగ్ ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. దీనివల్ల యూజర్లు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఇతర వ్యక్తులతో పంచుకుంటే ఎక్స్‌ట్రాగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది మొదట అమెరికాలో అందుబాటులోకి రానుంది.

Next Story