3 రోజెస్ నుంచి ‘బెట్టింగ్ భోగి’ గ్లింప్స్ రిలీజ్.. ట్రెండింగ్ డైలాగ్స్, కామెడీతో అదరగొట్టేశాడుగా..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-27 09:35:51  IST  )

ఈషా రెబ్బా(Isha Rebba), సత్య(Sathya), హర్ష చెముడు(Harsha Chemudu), ప్రిన్స్ సిసిల్, హేమ(Hema), సత్యం రాజేష్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “త్రీ రోజెస్”(Three Roses).

3 రోజెస్ నుంచి ‘బెట్టింగ్ భోగి’ గ్లింప్స్ రిలీజ్.. ట్రెండింగ్ డైలాగ్స్, కామెడీతో అదరగొట్టేశాడుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఈషా రెబ్బా(Isha Rebba), సత్య(Sathya), హర్ష చెముడు(Harsha Chemudu), ప్రిన్స్ సిసిల్, హేమ(Hema), సత్యం రాజేష్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “త్రీ రోజెస్”(Three Roses). ఆహా ఓటీటీ(Aha OTT)లో సూపర్ హిట్టయిన ఈ సిరీస్‌ నుంచి ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఇక దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కే ఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తుండగా.. కిరణ్ కె కర వల్ల దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ వెబ్ సిరీస్ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రమోషన్లలో భాగంగా నేడు త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి యాక్టర్ సత్య చేసిన ‘బెట్టింగ్ భోగి’ క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఇక గ్లింప్స్‌లో.. ‘బెట్టింగ్ ఆడటం చట్టరీత్యా నేరం, మీతో పాటు మీ కుటుంబానికి కూడా హానికరం, జాగ్రత్తగా ఉండండి రన్ అవుట్ కాకండి. హలో బుకింగ్ రేట్ కిత్నా’ అంటూ సత్యను ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్‌లో పరిచయం చేస్తోంది మాస్ మూవీ మేకర్స్. ఇక ఈ సిరీస్‌లో హీరోయిన్ రాశీ సింగ్ భర్తగా సత్య నటిస్తున్నాడు. ఫైనల్‌గా ఆయన చేసిన ‘బెట్టింగ్ భోగి’ క్యారెక్టర్ గ్లింప్స్ హిలేరియస్‌గా ఉండి నవ్విస్తోంది. క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్స్ పెట్టే ‘బెట్టింగ్ భోగి’గా మనం రియల్ లైఫ్‌లో చూసే ఎంతోమందిని గుర్తుచేశాడు సత్య. ముఖ్యంగా నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ వా.. కెరీర్ మీద కాస్త గట్టిగా ఫోకస్ చేయాల్సిందే అంటూ చెప్పే డైలాగ్స్ అదుర్స్ అంతే. కాగా త్వరలోనే “త్రీ రోజెస్” సీజన్ 2 వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story