Raayan: నెల రోజుల్లోనే ఓటీటీలోకి ధనుష్ ‘రాయన్’.. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2024-08-16 14:23:34  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించడంతో పాటుగా దర్శకత్వం వహించిన సినిమా ‘రాయన్’.

Raayan: నెల రోజుల్లోనే ఓటీటీలోకి ధనుష్ ‘రాయన్’.. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించడంతో పాటుగా దర్శకత్వం వహించిన సినిమా ‘రాయన్’. ఇందులో సందీప్ కిషన్, దుషరా విజయన్, ఎస్ జే సూర్య వంటి స్టార్స్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక దనుష్ కెరీర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కి జూలై 27న గ్రాండ్‌లో థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా రాయన్ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి దుమ్మురేపింది. దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ధనుష్ ఫ్యాన్స్ రాయన్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. రాయన్ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ ఆగస్టు 23 నుంచి తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఈ సినిమా విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కాగా, ధనుష్ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం కుబేర మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

(Video Link Credits to primevideoin Instagram Channel)

Next Story