Daku Maharaj: ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘డాకు మహారాజ్’.. ఎక్కడ చూడొచ్చంటే

by I. Sairam |

నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ).

Daku Maharaj: ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘డాకు మహారాజ్’.. ఎక్కడ చూడొచ్చంటే
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ). ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మించారు. అయితే ఈ మూవీలో బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) ఐటెం సాంగ్‌లో చిందులేసింది. ఇక ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోయింది.

అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు కెక్కింది. అయితే ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తదా అని ఫ్యాన్స్‌తో పాటు, ఓటీటీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రమంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇక దీని డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా నేటి నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ(Tamil), మలయాళం(Malayalam), కన్నడ(Kannada), హిందీ(Hindi) భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఓటీటీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి వరకు ఈ సినిమా చూడని వాళ్లు నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయండి. కాగా ఈ మూవీకి తమన్(SS Thaman) సంగీతం అందించిన సంగతి తెలిసిందే.




Next Story