- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలో చైతన్య లేటెస్ట్ క్రైమ్, కామెడీ థ్రిల్లర్ ‘పారిజాత పర్వం’.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
యంగ్ నటుడు చైతన్య రావు ముందు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయం అయి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

X
దిశ, సినిమా: యంగ్ నటుడు చైతన్య రావు ముందు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయం అయి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ‘కీడా కోలా షరతులు వర్తిస్తాయి’ మూవీతో ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. ఇటీవల చైతన్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పారిజాత పర్వం’. ఇందులో మాళవికా సతీశన్, శ్రద్దా దాస్, కమెడియన్ సునీల్, వైవా హర్ష, సురేఖ వాణి, జబర్దస్త్ రోహిణి, జబర్దస్త్ అప్పారావు కీలక పాత్రలో కనిపించారు.
కామెడీ, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 19న థియేటర్స్‌లో విడుదలై యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ‘పారిజాత పర్వం’ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. దీని ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. పారిజాత పర్వం జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆహా ప్రకటించింది.
Next Story






