L2 Empuraan OTT release date : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ..

by Chukka Sudharani |   (  Updated:2025-04-17 14:16:45  IST  )

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) నటించిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan).

L2 Empuraan OTT release date : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ..
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) నటించిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan). పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ చిత్రం లూసిఫ‌ర్‌(Lucifer)కి సీక్వెల్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో మోహన్ లాల్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రమోషనల్ కంటెంట్‌తోనే మంచి బజ్ సొంతం చేసుకున్న ‘L2’.. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ (Jio Hotstar)సొంతం చేసుకోగా.. ఏప్రిల్24 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు మోహన్ లాల్.

Next Story