- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖిల్ ‘ఏజెంట్’ కి బిగ్‌షాక్.. ఓటీటీ స్ట్రీమింగ్‌పై స్టే విధించిన కోర్టు
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం ‘ఏజెంట్’. దీనిని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు.

దిశ, వెబ్‌డెస్క్: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం ‘ఏజెంట్’. దీనిని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఏజెంట్ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 23 న రిలీజ్ అయి భారీ పరాజయాన్ని అందుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి హిట్ తర్వాత పాన్ ఇండియా సినిమాగా ఏజెంట్ ను మొదలుపెట్టగా అఖిల్ కష్టపడి బాడీ పెంచాడు. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో వాయిదాల తర్వాత ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. అయితే సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇది కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఓటిటీ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఏజెంట్ డిజిటల్ హక్కులు సోనీ లివ్ సొంతం చేసుకున్న క్రమంలో సెప్టెంబర్ 29 నుంచి సోనీ లివ్ లో ఏజెంట్ స్ట్రీమింగ్ కానుందని అనౌన్స్ చేశారు.
తాజాగా, ఏజెంట్ సినిమాకు షాక్ తగిలింది. ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు ఈ మూవీపై స్టే విధించిందని సమాచారం. అసలు విషయంలోకి వెళితే.. వైజాగ్ కు చెందిన పంపిణీదారుడు బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్,) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని, నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ న్యాయం కోరుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన వాదనలు విన్న తర్వాత ఈ నెల 29న ఏజెంట్ చిత్రం ఓటిటి లో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే ఇచ్చిందని అడ్వకేట్ కేశాపురం సుధాకర్ తెలిపారు. దీంతో ఈ విషయం తెలిసిన అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.






