- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే!
ఇటీవల కాలంలో అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నాయి.

దిశ, సినిమా: ఇటీవల కాలంలో అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మలయాళ చిత్రాలు అందరినీ మెప్పిస్తున్నాయి. అయితే ఇటీవల చిన్న సినిమాగా వచ్చిన ‘మంజుమ్మెల్ బాయ్’ ఫిబ్రవరి 22న విడుదలై హిట్ అయింది. అంతేకాకుండా ఒక్క మలయాళ భాషలోనే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది.
అలాగే ఈ సినిమా తెలుగులో ఏప్రిల్ 5న విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమా చూసేందుకు సినీ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా,మంజుమ్మెల్ బాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అయితే మే 03 నుంచి తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ, వంటి భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వారు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
Malayalam Cinema's Biggest BLOCKBUSTER Movie #ManjummelBoys Digital Premiere From May 3 On Disney+Hotstar... pic.twitter.com/a2vNNPAHd1
— The South Movies (@TheSouthMovies1) April 19, 2024






