- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న ‘అనగనగా ఒక రాజు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తాజాగా నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) మూవీకు మన ముందుకు వచ్చాడు.

దిశ, వెబ్‌డెస్క్: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తాజాగా నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) మూవీకు మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మారి(Mari) దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేసింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా.. జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయంతో పాటు కలెక్షన్స్ కూడా సాధించింది.
అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్(Net Flix)లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 11, 2026 నుండి ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ‘కమింగ్ సూన్’ సెక్షన్‌లో వెల్లడించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాల్సి ఉంది.






