రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఓటీటీలోకి రాబోతున్న సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2024-07-09 15:06:28  IST  )

విజయ భాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా పరిచయం అయిన మూవీ ‘జిలేబి’.

రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఓటీటీలోకి రాబోతున్న సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: విజయ భాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా పరిచయం అయిన మూవీ ‘జిలేబి’. దీనిని విజయ్ భాస్కర్ తెరకెక్కించగా.. ఎస్సార్కే ఆర్ట్స్ పతాకంపై గుంటూరు రామకృష్ణ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అయితే ఇందులో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని హీరోయిన్‌గా నటించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ జిలేబి సినిమా గత ఏడాది ఆగస్ట్ 18న థియేటర్స్‌లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, జిలేబి థియేటర్స్‌లో విడుదలైన 11 నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆహా ట్విట్టర్ వేదికగా.. ‘జిలేబి’ జూలై 13 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించింది. అలాగే ‘‘గిలిగింతల జిలేబి మన ఆహా లో తప్పకుండా చూడండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.

Next Story