- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama).

దిశ, వెబ్‌డెస్క్: పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama). కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ధనుష్(Dhanush) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్‌ను బాగా అలరించింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లో రిలీజ్ చేశారు.
అయితే పవిష్ నారాయణ్(Pavish Narayan) తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకున్నా హీరోయిన్స్ అనిఖా సురేంద్రన్(Anikha Surendran), ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier)లు సుపరిచితులే. అందుకే ఈ మూవీకి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్‌ను అలరించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
ఇందులో భాగంగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon Prime Video) సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈనెల 21 నుంచి ఈ సినిమాను ఓటీటీ(OTT)లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో చూడని వారు ఎల్లుండి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని చూసేయండి.
Read More..






