- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపావళి కానుకగా జపాన్ మూవీ
కోలీవుడ్ యాక్టర్ కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్డెస్క్ : కోలీవుడ్ యాక్టర్ కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తుంటారు. ప్రస్తుతం ఈయన జపాన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆయన ఓ ప్రత్యేకమైన ఎంటర్‌టైనర్ రోల్ లో కనిపించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. సునీల్, విజయ్ మిల్టన్ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన జపాన్ ఫస్ట్ లుక్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. రాజు మురుగన్ ఈ మూవీకి దర్శకుడు. విషయం ఏమిటంటే లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాబోతోందని తెలిసింది. కాగా కార్తీ ఈ సినిమాలో తన పోర్షన్ షూటింగ్ ని ముగించారు. టీమ్ అతి త్వరలో ప్యాచ్ వర్క్ ని కూడా పూర్తి చేయనుందట. కాగా ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.
Also Read: టాలీవుడ్ హీరోలకు సవాల్ విసిరిన హైదరాబాద్ సీపీ ఆనంద్.. స్పందించిన అడివి శేష్






