నాని మూ‘వి’కి ‘ఆహా‘ అనిపించే ఆఫర్

by  |
నాని మూ‘వి’కి ‘ఆహా‘ అనిపించే ఆఫర్
X

నేచురల్ స్టార్ నాని.. నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో కాగా.. నివేదా థామస్, అదితిరావు హైదరీ కథానాయికలు. మార్చి 25న విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. నానికి ఇది 25వ చిత్రం కాగా.. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. దీంతో కాస్త లేట్ అయినా సరే, థియేటర్లోనే సినిమా విడుదల చేయాలని భావించారు నిర్మాత దిల్ రాజు.

కానీ పరిస్థితులు ఎప్పుడు సాధారణం స్థితికి చేరుకుంటాయో తెలియదు. ఎప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయో తెలియదు. ఒక వేళ ఓపెన్ అయినా సరే.. ప్రేక్షకులు ఆశించినంతగా వస్తారో లేదో తెలియదు. దీంతో చాలా మంది నిర్మాతలు ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కూడా అదిరిపోయే ఆఫర్స్ ఇస్తూ నిర్మాతలను మరోసారి ఆలోచించుకోమని సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాత దిల్ రాజ్‌కు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ నుంచి ఆపర్ వచ్చినట్లు తెలుస్తోంది. రూ. 30 కోట్లకు ‘వి’ సినిమా హక్కులు ఇవ్వాలని దిల్ రాజును కోరారట అల్లు అరవింద్. మరి దిల్ రాజుకు ఈ ఆఫర్ నచ్చిందో లేదో? తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed