ఇకపై గ్యాస్ సిలిండర్ హోం డెలివరీకి ఓటీపీ

8

దిశ, వెబ్ డెస్క్: వచ్చే నెల నుంచి గ్యాస్ సిలిండర్(ఎల్‌పీజీ)లను హోం డెలివరీ చేసుకుంటున్నవారు వన్ టైం పాస్‌వర్డ్‌ను చెప్పాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ల చోరీని నిలువరించడంతోపాటు సరైన వినియోగదారుడిని గుర్తించడానికి ఆయిల్ కంపెనీలు డెలివరీ ఆథంటికేషన్ కోడ్(డీఏసీ)ను ఉపయోగించనున్నాయి. ఈ విధానం వచ్చే నెల నుంచి దేశంలోని వంద స్మార్ట్ నగరాలలో అమలులోకి రానుంది.

ఇప్పటికే ఈ విధానం పైలట్ ప్రాజెక్టుగా రాజస్తాన్‌లోని జైపూర్‌లో అమలవుతుండటం గమనార్హం. ఈ ప్రక్రియలో సిలిండర్‌ను బుక్ చేయగానే డీఏసీ వినియోగదారుడి రిజస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు చేరుతుంది. సిలిండర్‌ను రిసీవ్ చేసుకునే సమయంలో సదరు డీఏసీని చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయకుంటే డెలివరీ పర్సన్ అప్పటికప్పుడు యాప్ సహాయంతో కస్టమర్ మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేస్తారు.