అధికారులకు షాకిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ .. (వీడియో)

2143

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లా తాడూర్ మండలం మేడిపూర్ దుందుబీ వాగు నుండి గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీ, టిప్పర్ల సాయంతో తరలిస్తున్న ఇసుక వాహనాలను గ్రామస్తులు అడ్డగించారు. సుమారు 10 టిప్పర్ల దాకా లోడ్ చేసుకొని తరలిస్తున్న క్రమంలో వాహనాలను అడ్డగించి వారితో వాదించారు. పరిసర ప్రాంతాల్లో పంటపొలాలు ఉన్నాయని ఇసుకను తరలిస్తే దగ్గర్లోని పొలాలన్నీ ఎండి పోతాయని గ్రామస్తులు వాదించారు. జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణం కోసమే అధికారుల అనుమతి తీసుకొని ఇసుకను తరలిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా ఎలా అనుమతిస్తారని ఇసుక తరలించడం వల్ల తమ గ్రామం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ‘సాండ్ రూల్స్ తెలుసా.. ఏం చదువుకున్నావ్’ అని గ్రామస్తులను బెదిరించే ప్రయత్నానికి దిగిన అధికారులకు గ్రామ యువకుడు ధీటైన సమాధానం చెప్పిన వీడియో వైరల్‌గా మారింది. బ్యాచ్ నెంబర్ 2011 ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ని సాండ్ రూల్స్ నాకు తెలుసు అంటూ ఇచ్చిన సమాధానంతో అధికారులు అక్కడినుండి వెనుదిరిగారు. దీంతో జిల్లాలో ‘మన ఇసుక వాహనం’ ప్రారంభించే క్రమంలో గ్రామస్తులు అడ్డుతగలడంతో మన ఇసుక వాహనం పథకానికి అడ్డుకట్ట పడనుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనిపై భూగర్భ గనుల శాఖ అధికారి విజయరామరాజును వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..