ప్రారంభమైన ఆస్కార్ అవార్డుల వేడుక.. కానీ..!

by  |
ప్రారంభమైన ఆస్కార్ అవార్డుల వేడుక.. కానీ..!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచం మొత్తాన్ని భయాందోళనకు గురి చేస్తోంది కరోనా మహమ్మారి. ఇప్పటికే కొన్ని దేశాలు రాకపోకలు నిషేధించాయి. అయితే ఇలాంటి సమయంలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ వేడుకను లాస్ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్, యూనియన్ స్టేషన్‌లలో మొదలుపెట్టారు. కానీ కరోనా కారణంగా సెలబ్రిటీలను మాత్రమే అనుమతిస్తున్నారు. క్లోవీ చావ్ ఉత్తమ దర్శకురాలుగా ‘నో మ్యాడ్‌లాండ్’ చిత్రానికి గాను ఎంపికైంది. ‘జుడాస్ అండ్ ది బ్లాక్ మిస్సయా’ ఫేమ్ డానియెల్ కలువోయా ఉత్తమ సహాయనటుడిగా ఎంపిక కాగా, ‘సౌండ్ ఆఫ్ మెటల్’ను ఉత్తమ సంగీతం అవార్టు వరించింది. మరికాసేపట్లో మిగితా విభాగాల్లోని విజేతలను ప్రకటించనున్నారు.

Next Story

Most Viewed