ఆరోగ్యానికి ఆర్గానిక్​ ఫుడ్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-12-14 21:55:27  IST  )

<p>దిశ ప్రతినిధి, మేడ్చల్ : నగరంలో ఆర్గానిక్ ఫుడ్ హవా నడుస్తోంది. సిటీ జనాల్లో ఫార్మ్ టు టేబుల్ కాన్సెఫ్ట్ కు ఆదరణ పెరుగుతోంది. విదేశాల్లో ఎప్పటి నుంచో ఆర్గానిక్ ఫుడ్ రాజ్యమేలుతోంది. ప్రపంచమంతా సస్టెయినబల్ మంత్రం జపిస్తున్న వేళ, ఆ ప్రపంచానికే మినీ రూపంగా వృద్ధి చెందుతున్న హైదరాబాద్ మాత్రం ఎందుకు వెనకబడుతోంది. హెల్తీ ఫుడ్ పట్ల అభిరుచి చాటుకునేందుకు ఆర్గానిక్ ఫుడ్ అందించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఔట్ లెట్ల వైపు నగరవాసులు పరుగులు పెడుతున్నారు. [&hellip;]</p>

ఆరోగ్యానికి ఆర్గానిక్​ ఫుడ్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : నగరంలో ఆర్గానిక్ ఫుడ్ హవా నడుస్తోంది. సిటీ జనాల్లో ఫార్మ్ టు టేబుల్ కాన్సెఫ్ట్ కు ఆదరణ పెరుగుతోంది. విదేశాల్లో ఎప్పటి నుంచో ఆర్గానిక్ ఫుడ్ రాజ్యమేలుతోంది. ప్రపంచమంతా సస్టెయినబల్ మంత్రం జపిస్తున్న వేళ, ఆ ప్రపంచానికే మినీ రూపంగా వృద్ధి చెందుతున్న హైదరాబాద్ మాత్రం ఎందుకు వెనకబడుతోంది. హెల్తీ ఫుడ్ పట్ల అభిరుచి చాటుకునేందుకు ఆర్గానిక్ ఫుడ్ అందించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఔట్ లెట్ల వైపు నగరవాసులు పరుగులు పెడుతున్నారు. అయితే కరోనా మహామ్మారి వల్ల మధ్యలో కొన్నాళ్లు వెలుగులు మాయమైనా, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలనే కోరిక నుంచి ఉధ్బవించిన ఈ కాన్సెప్ట్ కు ఇప్పుడు ఫుడ్ ప్రేమికులు బ్రహ్మరథమే పడుతున్నారు. కొన్ని రెస్టారెంట్లు తమ సొంతంగా ఫార్మ్స్ నిర్వహిస్తుంటే.. మరికొన్ని మాత్రం నగర శివార్ల నుంచి సమాకూర్చుకుంటున్నాయి.

రైతులకు మేలు..

ఆర్గానిక్ పంటల వల్ల రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. ఫుడ్ ప్రియుల ఆరోగ్యం కాపాడిన వారవుతారు. పలు స్టార్ హోటళ్లు ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటుండంతో నగర శివారు ప్రాంత రైతులు ఆర్గానిక్ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. చేవెళ్లలో ప్రత్యేకంగా నోపాలస్, కాక్టీస్ వంటి ఉత్పత్తులను పండిస్తున్నారు. అదేవిధంగా మేడ్చల్, తూప్రాన్, శామీర్ పేట, మహేశ్వరం వంటి ప్రాంతాల్లో ఆర్గానిక్ టమోట మొదలు అన్ని రకాల కూరగాయాలను గ్రీన్ హౌస్ లలో పెంచుతున్నారు. ఆర్గానిక్ పంటలకు కాస్త ధర కూడా ఏక్కువగానే పలుకుతోంది. ఆరోగ్యం కోసం ఆ మాత్రం ఖర్చు చేయడం ఇబ్బందేమి కాదనేది నగరవాసులు అభిప్రాయం. ఏది ఏమైనా నగరవాసుల్లో పెరుగుతున్న ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఫిదా అవాల్సిందే మరీ..

ప్రత్యేక రెస్టారెంట్లు..

ఆర్గానిక్ వంటకాలంటే గతంలో ఫుడ్ ప్రియులు విచిత్రంగా చూసేవారు. ఆర్గానిక్ ఆహార పదార్థాలను అందించే హోటల్ ఏమైనా ఉందంటే అది టాక్ ఆఫ్ ద సిటీ కావొచ్చేమో. కానీ ఇప్పుడు ఆ తరహా రెస్టారెంట్లు బాగానే వెలుస్తున్నాయి. ఇక ఈ ఆర్గానిక్ వంటకాల రూపకల్పనలో మరో అడుగు ముందుకేసి ఫార్మ్ టు టేబుల్ కాన్సెఫ్ట్ ను నగరానికి పరిచయం చేశారు ఔత్సహికులు. జూబ్లీహిల్స్, సుచిత్ర, మాదాపూర్ వంటి వృద్ది చెందుతున్న ప్రాంతాల్లో ఏక్పోటిక్ ప్రూట్స్, కూరగాయల సూపర్ మార్కెట్ తోపాటు రెస్టారెంట్లను.. ఫార్మ్ టు ప్లేట్ కాన్సెప్ట్ తో నిర్వహిస్తూ ఫుడ్ లవర్స్ ను నిర్వహకులు ఆకట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్, కూకట్ పల్లిలో బాంబైరీ తమ ఔట్ లెట్లను ప్రారంభించింది. ఇవేనా అంటే.. స్టార్ హోటళ్లలోనూ ప్రత్యేకంగా ఆర్గానిక్ పార్మింగ్ చేసే రైతులతో ఒప్పందాలు చేసుకుని మరీ హెల్దీ ఫుడ్ అందించేందుకు ట్రై చేస్తున్నారు.

ఆరోగ్యమే.. ఆర్గానిక్ మార్గం

నగరవాసుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోంది. అసలే హోటల్ ఫుడ్ అంటేనే అపనమ్మకం. దీనివల్ల హోటల్ కు వెళ్లి ఏదో ఒకటి తినడం కాదు. ఆరోగ్యవంతమైనది తినాలనుకుంటున్నారు. ఒపేన్ కిచెన్ కాన్సెఫ్ట్ లు, న్యూట్రీషన్ల హాలు, చెప్ ఇంటరాక్షన్ వంటి కొంగొత్తు కాన్సెఫ్ట్ లను పరిచయం చేస్తున్నారు. దీని వల్లనే సిటీలో ఫార్మ్ టు టేబుల్ కాన్సెఫ్ట్ కు ఆదరణ పెరుగుతోంది.

Next Story