హోమ్ డెలివరీ వేళ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

by  |
హోమ్ డెలివరీ వేళ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వేళ… జన సమూహాల్లో నిలబడి అనవసరంగా అనారోగ్యం కొని తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఉండి.. ఆన్ లైన్ ఆర్డర్ పెట్టుకుంటే సరుకులైనా, ఆహార పదార్ధాలైనా ఇంటికే వచ్చేస్తాయి కదా అనే ఆలోచనలో పడ్డారు అందరు. ఇంటికి గ్రాసరీ, ఫుడ్ ప్యాకెట్స్ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. కరోనా ఇంకా వీడి పోలేదు కాబట్టి, మరి కొన్ని నెలల పాటు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వైరస్ ఎక్కువ కాలం నిలిచి ఉండే వస్తువులను తాకినప్పుడు వెంటనే చేతులను శానిటైజ్ చేసుకోవాలని లేదా సబ్బుతో కడుక్కోవాలని శాస్ర్తవేత్తలు సూచిస్తున్న విషయం మనందరికీ తెలుసే. కరోనా వైరస్.. రాగి మీద 4 గంటలు, అట్టపెట్టెలపై 24 గంటలు, ప్లాస్టిక్‌, స్టెయిన్‌లెస్ స్టీల్‌ వస్తువులపై 2 నుంచి 3 రోజులపాటు, అల్యూమినియం, చెక్క, పేపర్‌పై 5 రోజుల దాకా బతకగలదని పలు అధ్యయనాల్లో తేలింది. వైరస్‌ యాక్టివ్ ఉన్న సమయంలో ఆయా వస్తువులను చేతితో తాకి, అదే చేతితో ముక్కు లేదా నోటిని తుడుచుకుంటే కరోనా ఎటాక్‌ అవుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. గాలిలో కంటే వస్తువుల ఉపరితలంపైనే కరోనా వైరస్‌ కణాలు ఎక్కువ కాలం జీవించి ఉంటాయని మనకు తెలుసు. అందుకే అలాంటి వాటిని తాకిన చేతుల ద్వారా వైరస్‌ సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. వైద్యులు.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. అయితే మన ఫుడ్ లేదా గ్రాసరీ ఆర్డర్ చేసినప్పుడు లేదా వెజిటేబుల్స్ ఇంటికి తెచ్చుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

1. హైజీన్ రేటింగ్ చెక్ చేసుకోవాలి:

దాదాపు ఫుడ్ డెలివరీ యాప్స్ నిర్వాహకులు.. హైజీన్ రేటింగ్ ఉండే రెస్టారెంట్స్ నే లిస్టులో చేర్చుతారు. ఒక వేళ హైజీన్ రేటింగ్ లేని రెస్టారెంట్ ఉన్నట్లయితే ఆర్డర్ ఇవ్వకపోవడం మంచిది. అంతేకాదు డెలివరీ బాయ్ అన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాడో లేడో పరిశీలించాలి.

2. కాంటాక్ట్ లెస్ డెలివరీ :

లాక్డౌన్ స్టార్ట్ అయిన రోజు నుంచి .. దాదాపు ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ యాప్స్ అన్నీ కూడా తమ ఉద్యోగులతో కాంటాక్ట్ లెస్ డెలివరీ మాత్రమే చేయాలని సూచించాయి. ఇంటి గేటు దగ్గరి వరకే డెలివరీ చేస్తున్నారు. అంతేకాదు ఆర్డర్ చేసినప్పుడే, ఆన్ లైన్ పేమెంట్స్ చేయడమే అత్యుత్తమైన మార్గం.

3. డిస్కార్డ్ ద ప్యాకేజ్ :

ప్లాస్టిక్ లేదా కార్డ్ బోర్డుల్లోనే పార్సిల్ వస్తుంటాయి. కావున ఆయా ప్యాకింగ్ కవర్లు లేదా కార్డు బోర్డులను బయటే పడేసి వేరే వాటిల్లో ఇంట్లోకి తీసుకుపోవడం మంచిది. ఫుడ్ పార్సిల్ అయితే.. ఆహార పదార్థాలను బౌల్ లోకి తీసుకోవాలి. స్పూన్లు, ఫోర్క్ లు పార్సిల్ ఐటెమ్ తో వస్తే.. వాటిని కూడా బయట పారేయాలి. వాటిని ఉపయోగించకూడదు. గ్రాసరీ ఐటెమ్స్ ఏవైనా సరే ఆయా ప్యాకింగ్ కవర్లను విప్పేసి.. ఫ్రెష్ బాక్సుల్లోకి తీసుకోవాలి. కూరగాయలు తెచ్చుకుంటే… వాటిని శుభ్రంగా కడిగి.. ఫ్రిజ్ లో భద్రపరుచుకోవాలి.

4. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి :

గ్రాసరీ ఐటెమ్స్ ను ఎక్కడైతే.. ఓపెన్ చేస్తామో.. ఆ ప్రదేశాన్ని శానిటైజ్ చేయాలి. విప్పిన ప్యాకేజీ కవర్లన్నింటినీ డస్ట్ బిన్ లో వేసి.. సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.

5. ఆహారాన్ని వేడి చేయాలి :

కరోనా వైరస్ 70డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద డిస్ట్రాయ్ అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అందువల్ల డెలివరీ పుడ్ ను రీ హీట్ చేయడం ఉత్తమమైన పద్ధతి. రిఫ్రిజిరేటర్ లో పెట్టిన ఆహార పదార్ధాలను కూడా వేడి చేసే తినాలి.



Next Story

Most Viewed