వారి అకౌంట్‌లోకి నేరుగా డబ్బులు : మంత్రి జగదీష్ రెడ్డి

by  |
jagadish-reddy
X

దిశ, సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో నూతన ఆహార భద్రత కార్డు(రేషన్ కార్డ్స్)లను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం అనగానే ప్రతిపక్షాలకు వణుకు మొదలయ్యిందని ఎద్దేవా చేశారు. డిపాజిట్లు గల్లంతు అయి, తమ అడ్రస్ గల్లంతు అవుతుందన్న భయంతో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు.

దళిత బంధు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం.. రాష్ట్రం అంతటా అమలు అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం చేపట్టినా అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసమే చేపడతారని పేర్కొన్నారు. పైసా లంచం లేకుండా, పారదర్శకంగా పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని వెల్లడించారు. మధ్య దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లోకే డబ్బులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.

దళిత బంధు కూడా నేరుగా లబ్ధిదారులకు లాభం జరుగుతుందని.. రాష్ట్రంలో ప్రతిపక్షాల పని అయిపోయిందని.. వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. అందుకే ఉనికి కోసం దళిత బంధు పథకంపై రాద్దాంతం చేస్తూ ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని అన్నారు.


Next Story

Most Viewed