వారి మృతికి సానుభూతిగా విపక్షాలు కీలక నిర్ణయం

by  |
mps
X

న్యూఢిల్లీ: బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఢిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు మరో 12 మంది మృతికి సానుభూతిగా విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గురువారం రాజ్యసభ సమావేశాల్లో వారి మృతికి గౌరవ సూచికగా సస్పెండ్ అయిన ఎంపీలకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలకు బ్రేక్ ఇచ్చాయి. సమావేశాల్లో సభకు ఎలాంటి ఆటంకం కలిగించమని పేర్కొన్నాయి.

అయితే మృతులకు నివాళిగా విపక్షాల నేతలను మాట్లాడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. ‘సభ మరణాలకు సామూహికంగా సంతాపం తెలిపింది. ఇదే అంశంపై ఫ్లోర్ లీడర్లను విడివిడిగా మాట్లాడటానికి అనుమతించాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు. అయితే విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. నిరసనగా టీఎంసీ ఎంపీలు కూడా వాకౌట్ చేశారు. దేశానికి ముఖ్యమైన అధికారులు మరణించినప్పుడు విపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ అన్నారు. అంతేకాకుండా సభాధ్యక్షుడు, రక్షణమంత్రి మాత్రమే మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు. కాగా, తొలిసారిగా రాజ్యసభలో నిరసనలు లేకుండా సమావేశాలు కొనసాగాయి.


Next Story

Most Viewed