- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పీకర్ నిర్భంధం.. బీహార్ అసెంబ్లీలో హైడ్రామా!
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : బీహార్ అసెంబ్లీ వద్ద హైడ్రామా కొనసాగుతోంది. అధికార జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పోలీస్ చట్టాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సభలో గందరగోళం సృష్టించేందుకు సభ్యులు యత్నించారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ను కార్యాలయంలో విపక్ష సభ్యులు నిర్భంధించారు. అనంతరం కొత్త పోలీస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన మార్షల్ నిరసన తెలుపుతున్న సభ్యులను అసెంబ్లీ కార్యాలయం నుంచి బయటకు పంపించివేశారు. ఈ సందర్భంగా నెలకొన్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బీహార్ అసెంబ్లీ వద్ద హైడ్రామా కొనసాగుతోంది. అధికార జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పోలీస్ చట్టాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సభలో గందరగోళం సృష్టించేందుకు సభ్యులు యత్నించారు.
ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ను కార్యాలయంలో విపక్ష సభ్యులు నిర్భంధించారు. అనంతరం కొత్త పోలీస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన మార్షల్ నిరసన తెలుపుతున్న సభ్యులను అసెంబ్లీ కార్యాలయం నుంచి బయటకు పంపించివేశారు. ఈ సందర్భంగా నెలకొన్న తోపులాటలో ఇద్దరు సభ్యులు సొమ్మసిల్లి కిందపడిపోయారు.
Next Story






