మంత్రిపై ఆగ్రహం.. అందుకేనా మీడియాతో చిట్‌చాట్

by  |
Minister Puvvada Ajay Kumar
X

దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ను లోకల్ బస్టాండ్‌గా ప్రకటించాలని గతవారం రోజుల నుంచి పాత బస్టాండ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దఫాలవారీగా ఉద్యమాలు చేస్తు్న్న విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శనివారం బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ధర్నా నుంచి మీడియా దృష్టిని మళ్లించేందుకు టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. అంతేగాకుండా ధర్నాలో పాల్గొన్న సీపీఎం, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ పార్టీ నేతలను అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నేతలను అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాని తర్వాత పోలీసులు అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిన అనంతరం మంత్రికి సమాచారం అందించారు. విషయం అందిన వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిట్‌చాట్ ముగించారు. దీంతో ధర్నా నుంచి మీడియా దృష్టిని మళ్లీంచేందుకే చిట్‌చాట్ నిర్వహించారా? అని ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed