‘ఆ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం’

by  |
‘ఆ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం’
X

దిశ, ముషీరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పలు పార్టీల నాయకులు విమర్శించారు. మోసపూరిత ప్రకటనలను మానుకొని ప్రభుత్వం వెంటనే పేదలకు ఇళ్లు ఇవ్వాలని అని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ పలు పార్టీల ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్, సీపీఐ నగర కార్యదర్శి నరసింహ్మ, టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ బాల్రాజ్ గౌడ్, టీజేఎస్ నాయకులు రామ్ చందర్, సీపీఐ (ఎంఎల్)ఎస్‌డీ నాయకురాలు ఝాన్సీ, ఎస్‌యూసీఐ(సీ) నాయకుడు తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సవాళ్లు మోసపూరితమైనవని అన్నారు. గ్రేటర్ పరిధిలో ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా గత ఆరేళ్లలో 630 ఇళ్లు మాత్రమే కేటాయించారన్నారు. అసమర్థంగా ప్రవర్తించి గొప్పలు చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు.



Next Story

Most Viewed